ETV Bharat / state

ఒంటరి వృద్ధురాలిపై మద్యం మత్తులో లైంగిక దాడి, హత్య - Old Woman Raped in Drunkenness in madanapalle

Old Woman Raped in Drunkenness: ఇద్దరు కొడుకులు ఉన్నా.. వృద్ధురాలైన తల్లిని అద్దె ఇంట్లో ఉంచి పోషిస్తున్నారు. అదే ఆ తల్లి పాలిట శాపమైంది. బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Old_Woman_Raped_in_Drunkenness
Old_Woman_Raped_in_Drunkenness
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 12:18 PM IST

Updated : Nov 2, 2023, 1:11 PM IST

Old Woman Raped in Drunkenness : నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి (Suspect Death) చెందింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి (Rape) పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ ఈశ్వరమ్మకాలనీలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఉదంతం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకాశం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన వేణుగోపాల్ భార్య రెడ్డెమ్మ (58) మూడు సంవత్సరాలుగా నడవలేని స్థితిలో ఓ గదిలో నివాసం ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు సుబ్రహ్మణ్యం, బాలాజీ ఉన్నారు. కుమారులిద్దరూ వేరుగా నివాసం ఉంటున్నారు. నడవలేని స్థితిలో ఉన్న రెడ్డెమ్మను కుటుంబ సభ్యులు ఈశ్వరమ్మ కాలనీ ప్రధాన రహదారిలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఉంచి పోషిస్తున్నారు.

Village Volunteer Rape Tenth Class Student: ఆధార్‌ కార్డులు కావాలని వచ్చి.. బాలికపై వాలంటీరు అత్యాచారం

58 Years Lady Suspect Death in Annamayya District : ఈ నేపథ్యంలో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వేణుగోపాల్, ఇతని మనువడు హేమంత్ రెడ్డెమ్మకు భోజనం పెట్టేందుకు వచ్చారు. ఆ సమయంలో రెడ్డెమ్మ ఉంటున్న ఇంటి తలుపులు వేసి ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు తట్టారు. తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తోయడంతో తెరుచుకున్నాయి. అప్పటికే రెడ్డెమ్మ మంచంపై నుంచి కింద పడి ఉండగా మంచంపై ఓ వ్యక్తి పడుకుని ఉండటాన్ని గుర్తించారు. కింద పడిన రెడ్డెమ్మను పరీక్షించగా ఆమె అప్పటికే చనిపోయి ఉండటంతో ఆ వ్యక్తే రెడ్డెమ్మను చంపేశాడని స్థానికులు సాయంతో పట్టుకుని చితక్కొట్టారు.

Telugu Women Fire on YCP: వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరవు.. తెలుగు మహిళల ఆందోళన

రెడ్డెమ్మ శరీరంపై తీవ్రమైన గాయాలు : స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్.ఐ. లు. సుధాకర్, వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పరిశీలించి శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహంపై చేతులతో రక్కిన గాయాలు, కన్నుపై రక్తంతో కూడిన గాయం, దవడపై కొట్టడంతో వాపు వచ్చినట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని బట్టి చూస్తే నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మందలింపు.. ఎవరూ లేని సమయంలో : మద్యం మత్తులో ఉన్న నిందితుడిని ఆసుపత్రికి తరలించగా తన పేరు రవి అని, తనది మదనపల్లె మండలం రామాపురమని చెప్పాడు. పోలీసులు అతన్ని స్టేషన్​కు తరలించారు. హత్య (Murder) జరగక ముందు నిందితుడైన రవి మద్యం మత్తులో ఇంటి ముందు కూర్చొని ఉండగా మందలించడంతో వెళ్లి పోయాడని తర్వాత ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు.

Anantapur SP on gang rape case: మహిళపై అత్యాచారం ఆరోపణలపై... ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. కానీ..!

Last Updated : Nov 2, 2023, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.