Father Suicide: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన కలమడి ప్రసాద్‌బాబు (35), సుకన్య (28) దంపతులు. వీరికి ఐశ్వర్య, అక్షిత, అరవింద్, అవినాష్ సంతానం. బేల్దారి పనులు చేసుకుంటూ ప్రసాద్‌బాబు కుటుంబాన్ని పోషించేవాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు వారాల కిందట భార్య క్షణికావేశంతో ఇంట్లో ఉరేసుకున్నారు. అప్పటినుంచి ప్రసాద్‌బాబు మనోవేదనకు గురయ్యాడు. తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా పిల్లలను గత నెల 29న ఐసీడీఎస్ అధికారులకు అప్పగించాడు. తల్లి లేనందున తాను వారిని పోషించలేనని, మీరే చూసుకోవాలంటూ లేఖ రాసిచ్చాడు. వారు పోలీసుల సమక్షంలో బాలలను సంరక్షణలోకి తీసుకుని రాజంపేట బాలసదన్‌లో చేర్చారు.
ఆదివారం కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రసాద్‌బాబు పిల్లల వద్దకు వెళ్లాడు. కాసేపు వారితో హాయిగా గడిపాడు. సోమవారం ఉదయం రైల్వేకోడూరులోని రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలను అప్పగించే ముందురోజునుంచే తాను చనిపోతానని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ తమను ప్రసాద్‌బాబు కోరినట్లు సీడీపీఓ రాజేశ్వరి తెలిపారు. కౌన్సెలింగ్ చేసినా నిష్ఫలమైందని వాపోయారు.
ఇవీ చదవండి: