ETV Bharat / state

ఎంపీకి సమస్య చెబుదామని వెళ్తే.. మెడపట్టి గెంటేశారు - వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి

MP PV Midhun reddy: వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లిలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఓ వ్యక్తి తన సమస్యను ఎంపీ పరిష్కరిస్తారనే ఆశతో వెళ్లాడు. కాని అతన్ని మెడపట్టి గెంటేశారు. ఎందుకంటే... జ్యూస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 300 మంది కార్మికులకు అప్పట్లో ఇంటి పట్టాలు ఇచ్చారని ఇంతవరకు స్థలాలు చూపలేదని ఎంపీ దృష్టికి తీసుకెళ్లి ఆవేదనతో కొంచెం గట్టిగా మాట్లాడాడు. దీనికి ఆ పార్టీ నాయకులు పోలీసులు అతన్ని కార్యాలయం లోపల నుంచి మెడ పట్టుకొని బయటకు నెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎంపీ మిథున్ రెడ్డి
mp pv midhun reddy
author img

By

Published : Nov 2, 2022, 10:30 PM IST

MP PV Midhun reddy: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. తమ సమస్యను ఎంపీ పరిష్కరిస్తారనే ఆశతో ఓ వ్యక్తి వచ్చాడు. కానీ అతన్ని మెడపట్టి గెంటేశారు. ఎందుకంటే.. ఒకప్పుడు జ్యూస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న 300 మంది కార్మికులకు ఇంటి పట్టాలు పట్టాలు ఇచ్చారు. కానీ స్థలం చూపించలేదంటూ ప్రకాష్ అనే వ్యక్తి ఎంపీకి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాడు. దీంతో పోలీసులు, ఆ పార్టీ నాయకులు మెడబెట్టి బయటకు తోసేశారు.

మదనపల్లిలోని గుండువీధిలో శుద్ధి నీటి ప్లాంటును ప్రారంభించిన ఎంపీ.. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక్కడే గందరగోళం నెలకొంది. పరిస్థితి కొెెంచెం ఆందోళనకరంగా మారడంతో.. చివరకు ఎంపీ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.