Clash between TDP YCP: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జి. శంకర్ 'ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహించడానికి తంబళ్లపల్లి మండలంలోని కోటకొండ గ్రామానికి వచ్చారు. అయితే స్థానిక వైసీపీ నాయకులు శంకర్ గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా కొంతమంది నల్ల దుస్తులు, బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ కేసప్ప కోటకొండకు బయలుదేరి మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయన ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలోకి వెళ్లి.. తిరిగి వచ్చేస్తానని చెప్పగా పోలీసులు అందుకు అంగీకరించలేదు. చివరకు పోలీసులు శంకర్‌కు నచ్చజెప్పి వెనక్కి పంపారు.
ఇవీ చదవండి: