ETV Bharat / state

Chandrababu Unveiled the NTR Statue in Ballari: తెలుగువారి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్: చంద్రబాబు

Chandrababu Unveiled the NTR Statue in Ballari : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 'బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమం ఐదు రోజులపాటు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొనసాగనుంది. ఇప్పటికే ఆయన కర్ణాటక నుంచి రాయదుర్గం చేరుకోగా.. టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

Chandrababu_Tour_Anantapur_Kurnool_districts

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 5:26 PM IST

Chandrababu Unveiled the NTR Statue in Ballari : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఐదు రోజుల క్షేత్ర స్థాయి పర్యటన ప్రారంభించారు. 'బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొనసాగనుంది. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలు, సమావేశాలు, రోడ్‌షోలు, సభలు నిర్వహించనున్నారు. నేడు బళ్లారి మీదుగా రాయదుర్గం వెళ్లనున్న చంద్రబాబు... కర్ణాటక జిందాల్ స్టీల్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో స్థానిక నేతలు, తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో బళ్లారి చేరుకున్నారు. బాలాజీ నగర్​లో శివాలయంలో పూజలు చేసిన అనంతరం.. అక్కడి తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు రాక సందర్భంగా బళ్లారిలో స్థానిక నేతలు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. రాయదుర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Babu Surety Future Guarantee Program: 5వ తేదీ నుంచి 'బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ' కార్యక్రమం.. మొదటిగా ఆ జిల్లా నుంచే..!

NTR Statue at Ballari: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో మొదలై... తెలుగుదేశం అధినేత చంద్రబాబు బళ్లారి చేరుకున్నారు. చంద్రబాబుకు స్థానిక ప్రజలు, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఎన్టీఆర్(NTR) విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కర్ణాటక కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర, బళ్లారి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి హాజరయ్యారు. కర్ణాటకలో చంద్రబాబుకు పోలీస్ యంత్రాంగం భారీ భద్రత కల్పించింది. జిందాల్ ఎయిర్పోర్ట్ (Jindal Airport)లో దిగినప్పటి నుంచి కర్ణాటక బోర్డర్ నుంచి ఏపీలోకి అడుగుపెట్టే వరకు చంద్రబాబుకు రక్షణగా కర్ణాటక పోలీసులు ఉన్నారు. బళ్లారిలో చంద్రబాబు రక్షణ బాధ్యతలు ఎస్పీ రంజిత్ బండారు పర్యవేక్షించారు. చంద్రబాబు రాక పురస్కరించుకుని బళ్లారి (Ballari)లో తెలుగు ప్రజలు భారీగా బాణసంచా కాల్చారు.

TDP Zone 2 review Meeting: వైసీపీ అరాచక పాలనపై సమరానికి సిద్ధం.. నేడు కాకినాడలో టీడీపీ జోన్-2 సమీక్ష

Chandrababu Tour Anantapur and Kurnool Districts: ఐదు రోజుల పర్యటన.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఐదురోజుల క్షేత్ర స్థాయి పర్యటన ప్రారంభించారు. 'బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొనసాగనుంది. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలు, సమావేశాలు, రోడ్‌షోలు, సభలు నిర్వహించనున్నారు. సాయంత్రం రాయదుర్గం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్న చంద్రబాబు.. పల్లెపల్లిలో వేరుశెనగ రైతులతో సమావేశం కానున్నారు. రాత్రికి రాయదుర్గంలో బహిరంగసభ, రేపు కల్యాణదుర్గం, ఎల్లుండి గుంతకల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన (Chandrababu visit) ఉంటుంది. ఈ నెల 8, 9 తేదీల్లో బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.

Chandrababu Unveiled the NTR Statue in Ballari: తెలుగువారి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్: చంద్రబాబు

బళ్లారి ప్రజల అభిమానం చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నానా... బళ్లారిలో ఉన్నానా అనిపిస్తోందని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం గర్వకారణమని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అన్న చంద్రబాబు... తెలుగువారి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. తెలుగువారి గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.

Babu Surety Future Guarantee Program: 45 రోజులు.. 3 కోట్ల మంది ఓటర్లు లక్ష్యం.. టీడీపీ కొత్త కార్యక్రమం

భారీ బందోబస్తు... అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (TDP National President Nara Chandrababu Naidu) పాల్గొనే ఈ కార్యక్రమం ఆసాంతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ నిఘా ఉంటుందని జిల్లా అదనపు ఎస్పీ బి.నాగభూషణరావు వెల్లడించారు. బందోబస్తులో అడిషనల్ ఎస్పీ తోపాటు ముగ్గురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, 16 మంది ఎస్సైలు, 250 మంది కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాయదుర్గం పసుపుమయం.. తమ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు రాయదుర్గంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. పట్టణంలోని ప్రధాన వీధుల్లో స్వాగత తోరణాలు ప్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. ప్రధాన వీధులన్నీ టీడీపీ జెండాలతో పసుపు మయంగా మారాయి.

Kakinada TDP Zone-2 Meeting Updates: 'అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచం..ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చే బాధ్యతను తీసుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.