అనంతపురం జిల్లాలో..
సీఎంపై తెదేపా నేత నారా లోకేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అనంతపురంలో వైకాపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో పాలనకు, ప్రస్తుత పాలనకు తేడా ఏంటో ప్రజలకు తెలుసని అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. రాజకీయ కక్షలు రేపే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని వారు అన్నారు. నారా లోకేశ్ కంప్యూటర్ వదిలి ప్రజల్లోకి వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి విమర్శించారు.
విజయనగరం జిల్లాలో..
హత్యా రాజకీయాలను ప్రేరేపించే విధంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యవహరిస్తున్నారని విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కర్నూలులో జరిగిన జంట హత్యలు కేవలం కక్షపూరితమైతే, లోకేశ్ వాటిని వక్రీకరించి హత్యా రాజకీయాలుగా చిత్రీకరించడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో వడ్డీతో సహా మూల్యం చెల్లించుకుంటారన్న వ్యాఖ్యలు క్షమార్హమన్నారు. కత్తులతో రాజకీయం చేస్తున్నారన్న లోకేశ్ మాటలు అవివేకమని కొట్టిపారేశారు. చంద్రబాబు, లోకేశ్‌ల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతారని అన్నారు.
ఇవీ చదవండి:
త్వరలో మోదీ కేబినెట్ విస్తరణ- కీలక నేతలకు చోటు!
Vaccination Sunday:రేపు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు