అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో లక్షంపల్లికి చెందిన తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకులు దాడి చేశారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. గతంలో ఇరువర్గాలు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టుకుని గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో తెదేపా కార్యకర్తపై దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: భార్య నగ్న వీడియోలతో వ్యాపారం.. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు