అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో వైకాపా సంబరాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే శంకర్ నారాయణకు.. మంత్రిగా అవకాశం వచ్చిన నేపథ్యంలో.. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి, కేక్ కట్ చేశారు. తమ అభిమాన నేతకు మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
పెనుగొండ నుంచి....
గతంలో ఎన్టీఆర్ హయాంలో 1985లో పెనుకొండ తెదేపా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్ .రామచంద్రారెడ్డికి నియోజకవర్గం నుంచి మొదటి సారి మంత్రి పదవి దక్కింది. అనంతరం 1994లో తెదేపా ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యే శంకర్ నారాయణకు కేబినెట్ లో స్థానం దక్కింది.