అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లిలో యువకులు ఓటు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈవీఎమ్ యంత్రాలు ఎలా వినియోగించుకోవాలో చెప్పారు. ఈనాడు-ఈటీవీ భారత్, విజన్ యాత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా... నీతి, నిజాయతీలతో సేవ చేసే నాయకుణ్ని ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు.
ఇదీ చదవండి... విశాఖ ఉత్తరంలో.. వలసల పరంపర