ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి యువకుడు మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వెంకటరెడ్డిపల్లి గ్రామ సమీపంలో జరిగింది. వెలమకూరు గ్రామానికి చెందిన చంతా జయరామకృష్ణకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడైన మనోజ్ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. వెంకటరెడ్డిపల్లిలో బంధువుల పొలంలో సేద్యం చేసేందుకు స్నేహితుడు రవికుమార్‌రెడ్డితో కలిసి ట్రాక్టర్ వేసుకుని వచ్చాడు. పొలంలో సేద్యం చేస్తుండగా మనోజ్‌కు ఫోన్ రావటంతో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు చరవాణి కిందపడిపోయింది. దాన్ని పట్టుకునే క్రమంలో మనోజ్ ట్రాక్టర్ నుంచి జారి కిందపడ్డాడు. టైర్లు మనోజ్‌పై ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడి మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: