అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన నవ వరుడు మహమ్మద్ గౌస్.. ఈ నెల 9న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
చికిత్స పొందుతూ మహమ్మద్ గౌస్ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో మహమ్మద్ గౌస్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. మరోవైపు.. అతనికి వివాహమై వారం రోజులే అయిందని.. కుటుంబీకులు తెలిపారు.
ఇదీ చదవండి:
suhasini arrest: నిత్య పెళ్లికూతురు సుహాసిని అరెస్ట్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!