ETV Bharat / state

RAPE: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు - crime news in ananthapuram district

ఐదేళ్ల చిన్నారి(girl child)పై అత్యాచారాని(rape)కి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు(arrest) చేశారు. బాలిక కుటుంబంపై పగ తీర్చుకోవాలనే లక్ష్యంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానిక డీఎస్పీ(DSP) తెలిపారు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం(Hindupuram)లో జరిగింది.

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
author img

By

Published : Oct 16, 2021, 7:52 PM IST

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం, ఉత్తరప్రదేశ్​ కు చెందిన అజయ్(ajay)అనే యువకుడు... రెండు సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లా హిందూపురానికి(ananthapuram district hindupuram) వలస వచ్చారు. స్థానిక పారిశ్రామికవాడలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి తల్లిదండ్రులు, అజయ్ అనే యువకుడి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొద్ది రోజుల తరువాత అజయ్ వ్యసనాలకు బానిసవడంతో బాలిక కుటుంబం అజయ్​ను దూరంగా పెట్టారు. దీనిని జీర్ణించుకోలేని అజయ్... ఈ నెల 11న ఐదు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారాని(rape on girl child)కి పాల్పడ్డాడు.

చికిత్స నిమిత్తం చిన్నారిని హిందూపురం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి(private hospital)లో చికిత్స(treatment) అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరు(bangaluru) తరలించారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అజయ్​పై పోక్సో యాక్ట్(POCSO act) కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. చిన్నారి కుటుంబంపై కక్ష పెంచుకున్న నిందితుడు.. వారి కుటుంబంపై పగ తీర్చుకోవాలని, బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు పెనుగొండ డీఎస్పీ రమ్య తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వెల్లడించారు.

హిందూపురం మండలం గొల్లాపురం పారిశ్రామికవాడలో ఈ నెల 11న ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన చిన్నారిపై అజయ్ అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు ఘటనాస్థలానికి వెళ్లారు. తీవ్ర గాయాలపాలైన బాలికను ఆస్పత్రికి తరలించారు. వారి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. -రమ్య, పెనుగొండ డీఎస్పీ

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.