అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో ఓ యువకుడు పాముకాటుతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన ప్రభాకర్ ఉదయాన్నే గ్రామ శివార్లలోని చెట్ల పొదల్లో విగతజీవిగా పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తొలుత ఆత్మహత్య చేసకుకొని ఉంటాడని అందరూ భావించారు. ఒంటిపై పాము కాటు ఆనవాళ్లు ఉండటంతో పాము కాటు వల్లే మృతి చెందాడని ధ్రువీకరించారు.
ఇదీ చదవండి