ETV Bharat / state

ప్రారంభానికి నోచుకోక.. అసాంఘిక శక్తులకు నిలయంగా మైనార్టీ వసతి గృహాలు - ఏపీ వార్తలు

An ax for the future of Muslim youth: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా తయారైంది ఏపీలోని ముస్లిం మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు. గత టీడీపీ ప్రభుత్వంలో అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఆరుకోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో నిర్మించిన మైనార్టీ వసతి గృహాలు, జూనియర్ కళాశాల భవనాలు వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరితో ప్రారంభానికి నోచుకోవడం లేదు.మరికొన్ని భవనాలు ప్రభుత్వ కార్యాలయాలుగా మారడంతో మైనార్టీ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న సదాశయం నీరుగారిపోతోంది. తమ అభ్యున్నతికి కుటుంబపెద్దగా నిలవాల్సిన స్థితిలో ముఖ్యమంత్రి సవతితల్లి ప్రేమను కురిపిస్తుండటం దారుణమని ముస్లిం మైనార్టీ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి.

guntakal
minority college
author img

By

Published : Mar 23, 2023, 9:57 PM IST

An ax for the future of Muslim youth: టీడీపీ ప్రభుత్వంపై అక్కసుతో.. నాటి ప్రభుత్వ హయాంలో పూర్తి చేసుకున్న అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఆరుకోట్ల వ్యయంతో భవనాలను వాడుకలోకి తేవడంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ముస్లిం యువత భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారింది. మైనారిటీలకు కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమం, ఉన్నతికి బాటలు వేస్తామని ప్రతిపక్ష నేతగా హామీలు గుప్పించి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి.. సీఎం కాగానే తన ప్రకటనలన్నింటినీ విస్మరించడం సదా విమర్శల పాలవుతోంది. మైనార్టీల్లో అక్షరాస్యత పెంచి, ఉన్నత చదువులకు వెళ్లే ప్రణాళికపై వైసీపీ ప్రభుత్వం నీళ్లు చల్లింది. విద్యార్థులకు వసతిగా ఉపయోగపడాల్సిన భవనం నేడు మద్యం వ్యవసనపరుల అడ్డాగా మారడం దురదృష్టకరం.

హామీని నెరవేర్చిన టీడీపీ ప్రభుత్వం..: గుంతకల్లులోని ఇందిరానగర్ కాలనీలో మైనార్టీ ట్రస్టు నిర్వహిన్న ఉర్దూ పాఠశాల చదువు పూర్తి చేసుకున్న బాలికలకు జూనియర్ కళాశాల, వసతి గృహం నిర్మించాలని నాటి సీఎం చంద్రబాబు నాయుడును అభ్యర్థించారు. ట్రస్టు స్థలం ఇవ్వగా నాలుగు కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయటం, యుద్ధ ప్రాతిపదికన గుత్తేదారులను ఎంపిక చేసి ఎన్నికల ముందు సకల సౌకర్యాలతో భవనాల నిర్మాణం పూర్తి చేయించారు. బాలికల జూనియర్ కళాశాల కోసం రూ.2కోట్లు, వసతి గృహాన్ని మరో రూ.2కోట్లు వ్యయం చేసి రెండెకరాల భూమిలో ఒకే ప్రాంగణంలో రెండింటిని నిర్మించారు. ఈలోపు ఎన్నికలు రావటంతో ప్రారంభానికి అవకాశం లేకుండా పోయింది. అన్నీ పూర్తై విద్యార్థులకు వసతి కల్పించటానికి సిద్ధంగా ఉన్న ఈ భవనం దాదాపు నాలుగేళ్లుగా నిరుపయోగంగా మారింది.

నీరుగారిన చారిటబుల్ ట్రస్టు ఉన్నతాశయం..: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ముస్లిం మైనార్టీ జనాభా అధికంగా ఉంటుంది. మైనార్టీ వర్గాల్లో పేదరికం కారణంగా బడి మానేసే మైనార్టీ పిల్లలు అధికంగా ఉంటున్నారు. పేదరికాన్ని పారదోలడానికి మైనార్టీల్లో అక్షరజ్ఞానం పెంచేలా గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయకూడదన్న దుగ్ధతో వైసీపీ ప్రభుత్వం తమ భవిష్యత్తును తాకట్టు పెడుతోందని ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

ఆర్డీఓ కార్యాలయానికి కేటాయించటం శోచనీయం..: పట్టణంలోని సత్యనారాయణ పేటలో 2.18 కోట్ల రూపాయలతో సకల సౌకర్యాలతో బాలుర వసతి గృహాన్ని నిర్మించింది. నీటి సౌకర్యం మొదలు, పచ్చని చెట్ల మధ్యన నిర్మించిన బాలుర వసతి గృహం వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల మూలంగా ప్రారంభానికి నోచుకోలేదు. గుంతకల్లును ఈ మధ్యనే ప్రత్యేకంగా రెవెన్యూ డివిజన్ గా మార్చారు. ఈ దశలో మైనార్టీ విద్యార్థులకు వసతి కల్పించాల్సిన భవనాన్ని ఆర్డీఓ కార్యాలయానికి కేటాయించటం శోచనీయం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మైనార్టీ వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ముళ్లచెట్లతో అడవిలా ప్రాంగణం..: జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు అందుబాటులోకి తేవటంలో తీవ్ర నిర్లక్ష్యం చేయటంతో బాలికల జూనియర్ కళాశాల, వసతి గృహాల ప్రాంగణమంతా ముళ్లచెట్లతో నిండిపోయి అడవిలా మారింది. మరోవైపు అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది. సాయంత్రం మద్యం తాగేవారికి అడ్డాగా మారింది. ఫ్యాన్లు, మంచాలు ఇతరత్రా సామగ్రి దొంగల పాలైంది. ప్రభుత్వం ఈ భవనాలను త్వరగా ప్రారంభించాలన్న ఉర్దూ పాఠశాల ట్రస్టు ప్రతినిధుల అభ్యర్థనలను వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నాయని గుంతకల్లు మైనార్టీ సంఘం నాయకులు ఇంతియాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైకాపా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి సమాధానం చెప్పాలి..: ``మైనార్టీల్లోని పేద విద్యార్థుల కోసం గత ప్రభుత్వం వ్యయం చేసిన ఆరు కోట్ల రూపాయల విలువైన భవనాలు ఈ ప్రభుత్వం ఎందుకు అందుబాటులోకి తేవటంలేదో గుంతకల్లు వైకాపా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మైనార్టీలకు స్పష్టం చేయాలని ఉర్దూ పాఠశాల ట్రస్టు ప్రతినిధి డా.జిలాని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.