జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అనంతపురంలో వైకాపా శ్రేణులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. నగరంలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చారు. వైకాపా కార్యకర్తలు, అభిమానులు దుకాణాల వద్ద ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేసి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలంతా చూసేలా ఏర్పాట్లు చేశారు. పాదయాత్రలో తమనేత ప్రజల కష్టాలను స్వయంగా చూశారని.. అందుకే జనరంజక పాలనకు శ్రీకారం చుట్టారని నేతలు చెప్పారు. పేదల కష్టాలు తెలుసుకొని పాలనలో ముందుకు వెళ్లేలా జగన్ మోహన్ రెడ్డి స్వచ్చమైన ప్రభుత్వాన్ని నడుపుతారని తెలిపారు.
ఇది కూడా చదవండి.