అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో దుయ్యలకుంటపల్లిలో చంద్రలేఖ వాలంటీర్‌గా పని చేస్తున్నారు. తనను వైకాపా నాయకులు కాటమయ్య, శివారెడ్డి.. చాలా రోజులుగా వేధిస్తున్నారని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తమ మాట వినకుంటే పై అధికారులకు చెప్పి సస్పెండ్ చేయిస్తామని బెదిరిస్తున్నారని తెలిపింది. తనపై, కుటుంబీకులపై దాడి చేశారని వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేసింది. కాపాడాలని పోలీసులను కోరారు.
ఇవీ చదవండి: