అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సుబ్బారావు పేట గ్రామానికి చెందిన భాజపా వర్గీయులపై అదే గ్రామానికి చెందిన వైకాపా వర్గీయులు దాడి చేశారు. గ్రామంలో కొన్నేళ్ల నుంచి ఓ స్థలంలో భాజపా వర్గీయుల గ్రామస్థులు కొందరు గడ్డివాములు వేసుకున్నారు. ఆ స్థలం తమదేనంటూ వైకాపా వర్గానికి చెందిన వారు గొడవకు దిగారు.
గ్రామంలో విచారణ చేసేందుకు ఆర్డీవో మధుసూధన్, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. విచారణ అనంతరం అధికారులు ధర్మవరం వెళ్లిపోయారు. తమపై ఆరోపణలు చేసినందుకు వైకాపా వర్గీయులు.... భాజపా వర్గీయుడు గంగాధర్ ఇంటిలోకి చొరబడి కర్రలతో దాడి చేశారు. దాడిలో అంగన్వాడీ కార్యకర్త శిరీష, రామలింగమ్మ, ప్రభావతి, రమేష్‌లు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళలని చూడకుండా తమపై దాడి చేసి వస్త్రాలు చించారంటూ అంగన్వాడీ కార్యకర్త శిరీష తెలిపారు. ఈ మేరకు వైకాపాకు చెందిన ఓబిబి రెడ్డి, రామలింగారెడ్డి, పవన్ కుమార్ రెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు
ఇదీ చదవండి :