కొన్ని నెలలుగా జీతాలు అందడంలేదంటూ అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో సోలార్ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కూలీలలు సౌరవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టారు. ఏఐటూయూసీ నాయకులు వారికి మద్దతు తెలిపారు. అధికారపార్టీ నాయకులు కక్షసాధింపు చర్యలతో చాలా మంది కార్మికులను తొలగిస్తున్నారన్నారు. కార్మికులకు ఫిబ్రవరి నుంచి వేతనాలు అందడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేస్తూ సోలార్ ప్రాజెక్టు నిర్వహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేతనాలు చెల్లించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు స్పష్టం చేశారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి