అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ శివార్లలోని డంపింగ్ యార్డును తరలించాలని స్థానిక మహిళలు ఆందోళన చేశారు. ప్రస్తుత డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించడానికి అధికారులు రావటంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధి డంపింగ్ యార్డును తరలిస్తామని హామీ ఇచ్చినా.. అది నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ తరలించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని ప్రజలు హెచ్చరించారు.
ఇదీ చదవండి