అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలగొండ గ్రామనికి చెందిన ఉమాదేవి తహసీల్దార్ కార్యాలయం ఎదుట తన ఇంటి స్థలం కోసం నిరసనకు దిగింది.
ఆమె ఏం అంటున్నారంటే...
"వైకాపా నేతలు నా ఇంటి ముందు బండలు అడ్డంగా పాతి నన్ను,నా భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నాకు మా గ్రామ వైకాపా నాయకుల నుంచి ప్రాణహాని ఉంది. ఎలాగైనా న్యాయం చేయండి సారూ. గతంలో నాకు తహసిల్దార్ గారు పట్టా ఇచ్చారు. ఎంపీడీఓ గారు కూడా పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారండీ. నేను ఇల్లు కట్టుకుని ఉన్నా. కానీ.. 8 నెలల నుంచి ఇంటి పక్కన ఉన్న వైకాపా నేతలు కొంత మంది ఆ స్థలం తమదని బండలు పాతి మాతో గొడవలకు దిగుతున్నారు. జిల్లా పోలీసులకు,కలెక్టర్ కార్యాలయంలో ఎన్ని అర్జీలు పెట్టినా...సమస్య పరిష్కరిస్తాం అని చెప్తున్నారే కానీ బండల్ని తొలగించటం లేదు."
స్పందించిన తహసీల్దార్
ఉమాదేవి సమస్యపై.. స్థానిక తహసీల్దార్ స్పందించారు. వారం రోజుల్లో పరిష్కరించేలా చూస్తామని హామీ ఇవ్వగా.. ఆమె నిరసన విరమించారు.
ఇదీ చూడండి: