ETV Bharat / state

WOMAN MURDER: వివాహిత దారుణ హత్య...భర్తే హంతకుడా! - ananthapuram district crime

అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. అనుమానంతో భర్తే కర్రతో కొట్టడంతో మృతి చెందినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వివాహిత దారుణ హత్య
వివాహిత దారుణ హత్య
author img

By

Published : Nov 18, 2021, 9:33 AM IST

Updated : Nov 18, 2021, 4:39 PM IST

అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. పట్నం గ్రామానికి చెందిన హేమలత.. అదే గ్రామానికి చెందిన రామాంజనేయులుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానంతో భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వీరిరువురూ కలిసి ఉండటాన్ని.. హేమలత భర్త శివశంకర్ రెడ్డి చూసినట్లు స్థానికులంటున్నారు. దీంతో శివశంకర్ తీవ్ర ఆగ్రహంతో ఇద్దరిపై రోకలి బండతో దాడి చేశారంటున్నారు. ఈ ఘటనలో హేమలత తలకు రోకలిబండ బలంగా తగిలి.. తీవ్ర గాయాలపాలైంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని శివశంకర్ పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడు.

ఇదీచదవండి: PADAYATRA : అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం

Last Updated : Nov 18, 2021, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.