ETV Bharat / state

రైతుల ప్రాణాలు తీస్తున్న విద్యుత్​ తీగలు.. పొలంలో మహిళా రైతు మృతి

Woman farmer died of electrocution in the field: ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం కారణంగా మహిళా రైతు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. మెుక్కజొన్న తోటకు నీరు పెట్టడానికి వెళ్లిన మహిళా రైతు.. విద్యుదాఘాతంతో మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

electric shock
electric shock
author img

By

Published : Nov 23, 2022, 5:08 PM IST

Woman farmer died of electrocution: రాష్ట్రవ్యాప్తంగా విద్యుదాఘాతంతో రైతులు, అమాయక ప్రజలు మరణిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా విద్యుత్తు షాక్​తో మహిళా రైతు మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలో చోటు చేసుకుంది. దర్గాహొన్నూరులోని వ్యవసాయ పొలంలో మోటార్‌ ఆన్‌ చేసేందుకు వెళ్లి విద్యుత్​షాక్​తో మహిళా రైతు వాణి (25) మృతి చెందింది. మొక్కజొన్నకు నీరు పెట్టేందుకు వెళ్లగా.. నేలపై తెగిపడ్డ విద్యుత్​ తీగలను గమనించకుండా తొక్కడంతో విద్యుత్​షాక్​తో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళా రైతు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

గత కొద్ది రోజుల క్రితం దర్గా హోన్నూరు గ్రామంలో విద్యుత్ మెయిన్ లైను తీగ తెగిపడటంతో ఐదుగురు మృతి చెందారు. ఆ ఘటన మరువకముందే మహిళ మృతి చెందడంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.