అనంతపురంలో భార్యను భర్త చంపేశాడు. ఆమెపై అనుమానంతో మెడకు లుంగీని బిగించి హత్యచేశాడు. నగరంలోని జీసస్ నగర్లో నివాసం ఉంటున్న చిక్కనయ్యకు కర్నూలు జిల్లాకు చెందిన కవితకు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇవాళ ఉదయం అనుమానాస్పదస్థితిలో ఆమె మరణించింది. కుటుంబ కలహాలతో భార్యభర్త నిత్యం గొడవ పడుతుంటారని స్థానికులు తెలిపారు. అనుమానంతో భర్తే .. మృతురాలి మెడకు లుంగీని బిగించి హత్య చేశాడని అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేేస్తున్నారు.
ఇదీ చూడండి. తెలంగాణ: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య