ఇంటి నిర్మాణానికి అవసరమైన రాళ్ల కోసం వెళ్లిన ఓ మహిళ గోడకూలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. తలుపుల మండలం సంకటివారిపల్లిలో పాపులమ్మ అనే మహిళ పాత మైరాడ వద్ద పాడుబడిన గోడ రాళ్లను తెచ్చుకునేందుకు వెళ్లింది. రాళ్లు తీసుకునే సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని పాపులమ్మను బయటకు తీశారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు స్థానికులు గుర్తించారు.
ఇవీ చూడండి...