అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం గరుడచేడు గ్రామానికి చెందిన అక్కాచెల్లెలు మీనాక్షమ్మ, కమలమ్మ హంపీలోని ఓ మంటపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు సోమవారం రాత్రి గుర్తించి...పోలీసులకు సమాచారం ఇచ్చారు. హంపీ సీఐ హసన్‌సాబ్ తెలిపిన మేరకు వివరాలు.. గరుడచేడుకు చెందిన మీనాక్షమ్మకు సంతానం లేదు. 20ఏళ్ల క్రితం భర్త మృతి చెందడంతో చెల్లెలు కమలమ్మతో కలిసి ఉండేది. నవంబరు 29న ఇద్దరూ హంపీ వచ్చారు. జీవితంపై విరక్తితో మంటపంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కమలమ్మ కుమారుడు జలంధర్‌రెడ్డి వారిని వెతుకుతూ హంపీ వచ్చాడు. మృతదేహాలను చూసి తన అమ్మ, పెద్దమ్మ అని నిర్ధరించాడు. హంపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పురుగు మందు తాగి అక్కాచెల్లెలు బలవన్మరణం
రాయదుర్గం మండలం గరుడచేడు గ్రామానికి చెందిన అక్కాచెల్లెలు మీనాక్షమ్మ, కమలమ్మ హంపీలోని ఓ మంటపంలో జీవితంపై విరక్తితో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కమలమ్మ కుమారుడు జలంధర్‌రెడ్డి వారిని వెతుకుతూ హంపీ వచ్చాడు. మృతదేహాలను చూసి తన అమ్మ, పెద్దమ్మ అని నిర్ధరించాడు. హంపీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.