అనంతపురం జిల్లా గుంతకల్లులో చెత్త పనులు చెల్లించకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని ప్రజల్ని మున్సిపల్ శానిటరీ అధికారులు హెచ్చరించారు. దీంతో అధికారులపై మహిళలు మండిపడ్డారు.
28వ వార్డు మున్సిపల్ చైర్ పర్సన్ భవాని వార్డులో మున్సిపల్ అధికారులు మూడు నెలలపాటు చెత్త పన్నులను ఒకేసారి చెల్లించాలని లేకపోతే మీ తాగునీటి కుళాయిలు పెన్షన్లు రేషన్ రద్దు చేస్తామని శానిటేషన్ అధికారులు హెచ్చరించారని మహిళలు తెలిపారు.
తాము కూలి పనులు చేసుకుని జీవనం చేస్తుంటే చెత్త పన్నులు ఒకేసారి మూడు నెలలు చెల్లించాలని బెదిరింపులకు దిగడం అన్యాయమన్నారు. పెన్షన్ రద్దు చేస్తే ఎలా జీవించాలని మహిళలు, లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఓ మారు పన్నులు రూ.30 చెల్లించామన్నారు. సంక్షేమ పథకాలు రద్దు చేస్తే ఉద్యమ బాట పడతామని మహిళలు హెచ్చరించారు.
ఇదీ చదవండి: Video Viral: రైతుల నుంచి లంచం తీసుకుంటున్న రెవెన్యూ అధికారి!