కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులును అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సత్కరించారు. విధుల్లోకి హాజరైన ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువకప్పి ఆహ్వానించారు.
కరోనా పాజిటివ్ అని తేలిన మేరకు.. డీఎస్పీ ఈ నెల 9న బెంగళూరు ఆసుపత్రిలో చేరారు. కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. హోం క్వారంటైన్ ముగించుకుని విధులకు హాజరయ్యారు. జిల్లా పోలీస్ కార్యలయంలో ఉన్న ఎస్పీని కలిశారు.
ఇదీ చదవండి: