అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామ సచివాలయం ముందు చేనేత కార్మికులు ఆందోళన చేపట్టారు. అర్హులైన చేనేతలవి కాకుండా... అనర్హుల పేర్లను జాబితాలో నమోదు చేసి తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. సంవత్సరానికి రూ.24,000 అర్హులైన చేనేత కార్మికులకు ఇచ్చేందుకు... ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టింది. కొంతమంది వైకాపా నేతలు... గ్రామ వాలంటీర్ల ద్వారా అనర్హుల పేర్లను జాబితాలో చేర్చారని వాపోయారు. వారికి మగ్గం లేకపోయినా జాబితాలో పేరు నమోదు చేసి... నిజమైన చేనేతలను అన్యాయం చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉరవకొండ గ్రామ సచివాలయం ఎదుట చేనేత కార్మికుల నిరసన - అనంతపురం జిల్లాలో గ్రామ సచివాలయం ఎదుట చేనేత కార్మికుల ధర్నా
ఉరవకొండ గ్రామ సచివాలయం ఎదుట చేనేత కార్మికులు నిరసన చేశారు. అనర్హులను వైఎస్సార్ నేతన్న నేస్తం జాబితాలో చేర్చి... నిజమైన చేనేతలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామ సచివాలయం ముందు చేనేత కార్మికులు ఆందోళన చేపట్టారు. అర్హులైన చేనేతలవి కాకుండా... అనర్హుల పేర్లను జాబితాలో నమోదు చేసి తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. సంవత్సరానికి రూ.24,000 అర్హులైన చేనేత కార్మికులకు ఇచ్చేందుకు... ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టింది. కొంతమంది వైకాపా నేతలు... గ్రామ వాలంటీర్ల ద్వారా అనర్హుల పేర్లను జాబితాలో చేర్చారని వాపోయారు. వారికి మగ్గం లేకపోయినా జాబితాలో పేరు నమోదు చేసి... నిజమైన చేనేతలను అన్యాయం చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉరవకొండ మండలం.
* రోడ్డెక్కిన చేనేతలు.
* గ్రామ వాలంటీర్ల ద్వారా అనర్హులకు నేతన్న నేస్తం పథకం.
* నిజమైన చేనేతల పేర్లను తొలగించిన వైనం.
()ఇన్ని రోజులు రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తోరోకో, ధర్నాలు చేయడం చూసాం. కానీ ఇప్పుడు చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
వైస్సార్ నేతన్న నేస్తం పథకంలో అర్హులైన చేనేత కార్మికులకు అన్యాయం జరిగిందని, జాబితాలో అర్హులైన చేనేతలవి కాకుండా అనర్హుల పేర్లను నమోదు చేసి తమకు అన్యాయం చేశారని చేనేత కార్మికులు ఉరవకొండ గ్రామ సచివాలయం ముందు ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నవరత్నాలుకు ప్రాధాన్యం ఇవ్వాలని కుల,మత రాజకీయాలకు అతీతంగా పధకాలు అర్హులైన పేదలకు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్న ఆచరణ మాత్రం ఆ దిశగా లేదంటే ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలలో ఒకటైన నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ముఖ్యంగా నవరత్నాలు అమలు పైన దృష్టి పెట్టి వీలైనంత త్వరగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. అందులో భాగంగా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నేతన్న నేస్తం ద్వారా సంవత్సరానికి 24,000 రూపాయలు అర్హులైన చేనేతలను అందించేందుకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేసింది. కానీ ఆచరణలో మాత్రం నిజమైన అర్హులకు కాకుండా ఒక పార్టీకి చెందిన అనర్హులు పేర్లను నమోదు చేసి నిజమైన అర్హుల పేర్లను తొలగించారు అంటూ ఉరవకొండలోని గ్రామ సచివాలయంలో చేనేత కార్మికులు ఆందోళన చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మగ్గం ఉన్న తమను అనర్హులు చేసి అన్యాయం చేశారని కొంత మంది చేనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వైసిపి నాయకులు గ్రామ వాలంటీర్ల ద్వారా అనర్హుల పేర్లను జాబితాలో చేర్చారని అన్నారు. వారికి మగ్గం లేకపోయినా జాబితాలో పేరు నమోదు చేసి నిజమైన చేనేతలను అన్యాయం చేస్తున్నారు అని నేతన్నలు వాపోతున్నారు. అధికారులు స్పందించి నిజమైన చేనేతలను న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Body:బైట్స్ : చేనేత కార్మికులు.
Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 27-11-2019
sluge : ap_atp_71_27_wevers_dharna_nethanna_nestham_AVB_AP10097
cell : 9704532806