తుంగభద్ర జలాశయం నుంచి అనంతపురం జిల్లాకు నీటి విడుదల కావటంతో.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీబీ డ్యాంకు ఎగువ నుంచి వరద నీరు పెరుగుతుండటంతో... హెచ్చెల్సీ, ఎల్ఎల్సీ కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈసారి టీబీ జలాశయానికి 163 టీఎంసీల వరద నీరు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ వాటాగా 51 టీఎంసీల నీటిని విడుదల చేయటానికి నిర్ణయించినట్లు తెలిపారు. కర్ణాటకలో తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతుండటంతో.. డ్యాంలో నీటి నిల్వ 42 టీఎంసీలకు చేరినట్లు వివరించారు.
ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో యువకుడి మృతి