అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని రాగులపాడు ఎనిమిదో లిఫ్ట్‌కు కృష్ణా జలాలు చేరుకున్నాయి. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అధికారులు... నాలుగు పంపుల ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని హంద్రీనీవా కాలువలోకి విడుదల చేస్తున్నారు. ఈ జలాలు.. ఉరవకొండ మండలం మీదుగా జీడిపల్లి రిజర్వాయర్ కు చేరుకున్నాయి. సుదీర్ఘ సమయం తర్వాత ప్రాజెక్టులో నీరు చేరటంతో పరిసర ప్రాంతాల్లోని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.