అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఐపార్శపల్లిలో నీటి కష్టాలకు ఈ చిత్రమే నిదర్శనం. గ్రామంలో ఏర్పాటు చేసిన కొళాయిలకు మూడు రోజులకోసారి నీరు వస్తున్నాయి. అందులోనూ అరకొరే. అయితే గ్రామం మీదుగా ఏర్పాటు చేసిన పంచాయతీ ప్రధాన పైపులైనుకు ఓచోట లీకేజీ ఏర్పడి నీరు వృథాగా వెళుతోంది. దీంతో గ్రామస్థులు డ్రిప్ పైపుల ద్వారా వృథా నీటిని తమ ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, లీకేజీని అరికట్టి కొళాయిలకు నిత్యం నీరివ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: