అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఉన్న శ్రద్ధ ఇంటిలెక్చువల్ ప్రైవేట్ పాఠశాలలో గంట మోగగానే విద్యార్థులందరూ వాటర్ బాటిల్స్ తాగటం మెుదలు పెడతారు. ఇది యాజమాన్యం పెట్టిన నియమం. ఎందుకంటే విద్యార్థులు మంచినీటిని తగు మోతాదులో తీసుకోవటం లేదని గుర్తించిన స్కూలు పెద్దలు ఈ నిబంధన తీసుకొచ్చారు. పాఠశాల ప్రారంభమైన నుంచి ముగిసే వరకూ మూడు సార్లు నీటి గంటను మోగిస్తారు. ఇలా తగు సమయాల్లో నీరు తాగడం వల్ల విద్యార్థులకు డీహైడ్రేషన్, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని యాజమాన్యం వివరిస్తోంది. నీటి గంట కార్యక్రమం మెుదలై ఐదు రోజలవుతోందనీ, నీటిని ఎక్కువ తాగుతున్న విద్యార్థులు ఉత్సాహంగా ఉంటున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ప్రతీ పాఠశాలలో ఈ కార్యక్రమం చెపడితే, అనారోగ్యాలతో విద్యార్థులు బాధపడరని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి:
మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సారూ..!