అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం కడమలకుంట గ్రామానికి చెందిన ఓ వాలంటీర్, యానిమేటర్ అతని స్నేహితులతో కలిసి మహిళలపై దాడికి పాల్పడ్డారు. మీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోండి అంటూ మహిళలను దుర్భాషలాడారు. మహిళ చీర కొంగు చింపి గాయపరిచారు. గర్భిణీ అని తెలిసి కూడా ఓ చెయ్యి చేసుకున్నాడని బాధితులు తెలిపారు.
గతంలో నీటి విషయమై గ్రామంలో గొడవ జరిగింది. ఈ అంశంపై గత రాత్రి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. గాయపడిన మహిళలు ఉరవకొండ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకొని స్వగ్రామం వెళ్లిపోయారు. గ్రామంలో వీరు ప్రతి ఒక్కరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు తెలిపారు. గతంలో వీరిపై కేసులు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేశామని... నిందితులను అదుపులోకి తీసుకుంటామని వజ్రకరూర్ ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు.