రాజకీయ పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా సంక్షేమాన్ని అందించే పార్టీకే ప్రజలు ఓటు వేస్తారని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా అనంతపురానికి విచ్చేసిన కారెం శివాజీ .... రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో భాజపా, జనసేనలు ఆలయాల దాడులను ప్రేరేపిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ఆలయాలను, దేవుళ్ళను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వం, పోలీసులే కాకుండా రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఇవీ చదవండి: పద్మశ్రీతో వెలితి పోయింది: ఆశావాది ప్రకాశరావు