ETV Bharat / state

ఏడాది కాకముందే పెచ్చులూడుతున్నాయి.. ఆందోళనలో తల్లిదండ్రులు

author img

By

Published : Feb 23, 2023, 3:33 PM IST

BELUGAPPA ZILLA PARISHAD HIGH SCHOOL BULIDING : ఆ పాఠశాలలో నాబార్డ్​ నిధుల కింద కొన్ని తరగతుల నిర్మాణం చేపట్టారు. సుమారు రెండు కోట్లు వెచ్చించి గదుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే అవి నిర్మించి సంవత్సరం పూర్తి కాకముందే పెచ్చులు ఊడటం మొదలయ్యాయి. ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఇప్పుడా తరగతులపైనే నాడు-నేడు కింద మరికొన్నింటిని నిర్మిస్తున్నారు.

BELUGAPPA ZILLA PARISHAD HIGH SCHOOL BULIDING

నిర్మాణం పూర్తై ఏడాది కాకముందే పెచ్చులూడుతున్న తరగతి గదులు.. ఆందోళనలో తల్లిదండ్రులు

BELUGAPPA ZILLA PARISHAD HIGH SCHOOL BUILDING : కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన తరగతి గదులు సంవత్సరం తిరగకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నాసిరకం వాటితో నిర్మించిన గోడలకు పగుళ్లు ఏర్పడి.. తలుపులు, కిటీకీలు చెదలుపట్టి, స్లాబ్​ల పెచ్చులు ఊడి అధ్వానంగా తయారవుతున్నాయి. ఎక్కడి నుంచి ఏ పెచ్చులు ఊడిపడతాయో అని విద్యార్థులు అనునిత్యం భయపడుతున్నారు.

అనంతపురం జిల్లా బెళుగుప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొదటి విడతలో భాగంగా నాబార్డ్ నిధులు ఉపయోగించి 10 తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. దాదాపు రూ. 1.79 కోట్లతో 7 తరగతి గదుల నిర్మాణాన్ని 2020లో మొదలుపెట్టి 2022 జులై నాటికి పూర్తి చేసి అప్పజెప్పారు. అయితే పర్యవేక్షణ ఇంజినీర్, గుత్తేదారుడు కుమ్మక్కై గదుల నిర్మాణాలు నాసిరకంగా చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని గ్రామస్థులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

గదుల నిర్మాణాలకు వాడిన ఇటుకలు బూడిదతో కూడి ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవే గదులపై ప్రస్తుతం రెండో విడతలో భాగంగా నాడు-నేడు పనులు కింద రూ. కోటితో మరో ఎనిమిది తరగతి గదులు నిర్మిస్తున్నారు. అయితే గదుల నిర్మాణాలకు అవసరమైన సిమెంటు ఇటుకలను గతంలో రూ.26 చొప్పున అనంతపురం నుంచి సరఫరా చేశారు. ప్రస్తుతం వాటిని తిరస్కరించి స్థానికంగా రూ. 29తో ఇటుకలు కొనుగోలు చేయడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే అధిక మొత్తానికి సిమెంటు ఇటుకలను కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2022 జులైలో కోటి 70 లక్షల రూపాయల నాబార్డ్​ నిధులతో గదులు నిర్మించి పాఠశాలకు అప్పజెప్పినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు తెలిపారు. గదుల నిర్మాణం పూర్తైన రెండు నెలల తర్వాత పగుళ్లు ఏర్పడినట్లు వెల్లడించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని.. వాటి స్థానంలో కొత్తవి అమర్చడానికి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే తరగతి గదులలో ఊడిపోతున్న పెచ్చులతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

"నాబార్డ్ నిధులతో నిర్మించిన గదులు పెచ్చులు ఊడటాన్ని గుర్తించి.. ఈ విషయాన్ని రెండు నెలల క్రితం ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేశాం. వారు పాఠశాల గదులను పరిశీలించి నెర్రెలను గుర్తించారు. దెబ్బతిన్న తలుపులు, కిటికీల స్థానంలో కొత్తవి అమర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు" -శ్రీనివాసులు, బెళుగుప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.