గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 26 వ తేదీ వరకు ...రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అనంతపురం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పరీక్ష సమయానికి గంట ముందు నుంచే అభ్యర్థులను లోనికి పంపాలని కలెక్టర్ సూచించినా... అనంతపురంలోని ఓ పరీక్ష కేంద్రంలో నిర్వాహకులు అనుమతించలేదు. కారణాలపై ప్రశ్నిస్తే.. వైద్య సిబ్బంది లేరని.. అభ్యర్థులను పరీక్షించాకే లోనికి పంపిస్తామని చెప్పారు. చివరికి.. ఎలాంటి పరీక్షలు చేయకుండానే.. అభ్యర్థులను పరీక్షకు అనుమతించారు.
విశాఖలో...
విశాఖ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలు ఆరంభమయ్యాయి. జిల్లాలో 1,585 పోస్టులకు 1,50,441 మంది అభ్యర్థులు హాజరవ్వనున్నారు. జిల్లాలో మొత్తం 277 పరీక్ష కేంద్రాలలో పరీక్షా నిర్వహణ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతంలో 109, జీవీఎంసీ పరిధిలో 168 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక అధికారులను జిల్లా యంత్రాంగం నియమించింది. అభ్యర్థులు రవాణాకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. కరోనా సోకిన వారిని సైతం పరీక్షలకు అనుమతించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:
నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి పరీక్షలు