ETV Bharat / state

ఆలయ గోపురం తవ్వకం.. గుప్త నిధుల కోసమే అని అనుమానం - గుప్త నిదుల కోసం అమరాపురంలో ఆలయ గోపురాన్ని తవ్విన దుండగులు

అనంతపురం జిల్లా అమరాపురం మండల కేంద్రంలో వీరభద్ర స్వామి ఆలయ గోపురానికి రంధ్రం పడింది. గుర్తించిన అర్చకులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

digging for hidden treasure
దుండగులు తవ్విన గోపురం
author img

By

Published : Nov 29, 2020, 3:17 PM IST

అనంతపురం జిల్లా అమరాపురం మండల కేంద్రంలో వెలసిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో.. దుండగులు నిన్న రాత్రి తవ్వకాలు జరిపారు. సొరంగ మార్గం తవ్వినట్లు ఉన్న రంధ్రాన్ని.. ఉదయం పూజ కోసం వెళ్ళిన భక్తులు గమనించారు. ఆలయ గోపురాన్ని పడగొట్టి.. శిఖరంపై తవ్వకాలు జరిపారని ఆలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఘటనపై ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తవ్వకాలపై దర్యాప్తు చేపట్టారు. గతంలో ఇదే ఆలయంలో వీరభద్ర స్వామి మూల విరాట్, గణనాథుడు, బసవన్నల విగ్రహాలను దుండగులు దోచుకెళ్లారు. గుప్త నిధుల కోసమే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:

'కొవిషీల్డ్ వికటించింది.. రూ.5 కోట్లు ఇవ్వండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.