ETV Bharat / state

అనంతపురంలో సాంకేతిక విశ్వవిద్యాలయాల వీసీల సదస్సు - జాతీయ స్థాయి వీసిల సదస్సు న్యూస్

దేశంలో ఇంజినీరింగ్ విద్యలో పెను మార్పులు తీసుకురావల్సిన అవసరంపై సుధీర్ఘ చర్చకు ఇవాళ అనంతపురం వేదిక కానుంది. రెండు రోజుల పాటు దేశవ్యాప్త ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సు జరగనుంది.

అనంతపురంలో సాంకేతిక విశ్వవిద్యాలయాల వీసీల సదస్సు

author img

By

Published : Feb 13, 2020, 2:20 PM IST

అనంతపురంలో సాంకేతిక విశ్వవిద్యాలయాల వీసీల సదస్సు

ప్రస్తుతం దేశంలోని చాలా ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయాలు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దటంలేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల ప్రాంగణాల్లో ఎంపికైన విద్యార్థులకు ఆయా కంపెనీలే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. విద్యార్థులను నైపుణ్యవంతులుగా చేసేందుకు.. విద్యా ప్రమాణాలు మెరుగుపర్చటమే లక్ష్యంగా అనంతపురంలో జాతీయస్థాయి సాంకేతిక విశ్వవిద్యాలయాల వీసీల సదస్సును ఈ రోజు నిర్వహిస్తున్నారు.

2018లో కర్ణాటకలోని బెళగావి విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయంలో వీసీల తొలి సదస్సు నిర్వహించారు. అక్కడ చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఇప్పటికే కొన్ని యూనివర్సిటీల్లో కొంత మేర మార్పులు చేయగలిగారు. ప్రస్తుతం వీసీల రెండో సదస్సు అనంతపురం జేఎన్టీయూలో నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:

రాజధానుల ఆవశ్యకతపై.. ప్రధానికి సీఎం జగన్ వివరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.