ETV Bharat / state

అనంతలో భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి పూజలు - పాతూరు చెన్నకేశవస్వామి ఆలయంలో వైకుంఠ దర్శనం తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారు జామున నుంచే భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నిబంధనలు పాటించి భక్తులు దర్శనం చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Vaikuntha Ekadashi Pujas at anantapuram
అనంతలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు
author img

By

Published : Dec 25, 2020, 10:42 AM IST

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకొని పూజాలు చేశారు. ఆలయ కమిటీ భక్తులకు తిరుపతి లడ్డును భక్తులకు ప్రసాదంగా అందజేశారు. భక్తులంతా మాస్కులు ధరించి స్వామిని దర్శించుకున్నారు.

అందరిని ఆకర్షించిన అలంకరణ..

గుంతకల్లులోని రాజేంద్రనగర్​లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిశేషా వాహనంపై అలంకరించిన శ్రీవారిని, తిరుమల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ప్రసాదాన్ని సాంప్రదాయబద్దంగా.. ఊరేగింపుతో తీసుకెళ్లి ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి ధనుర్మాస, షాడోపాచార పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయంలోని దేవతామూర్తులకు కళాకారులచే విశేష అలంకరణ చేయించారు. రాష్ట్రంలో సుప్రసిద్ధ దేవాలయాలైన కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, మురడేశ్వర్లోని శివరూపం, సింహాచలం అప్పన్న, తిరువనంతపురంలోని రగనాథుడి రూపాల్లో పూలతో చేసిన అలంకరణ అందరిని ఆకర్షించాయి. ఆలయంలోని మండపంలో సూర్య ప్రభ వాహనంపై వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి తులా భారం ఏర్పాటు చేశారు.

కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం..
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కదిరిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు.. శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడిని ఉత్తర గోపురం కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా కారణంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

పాతూరు చెన్నకేశవస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం..

ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లాలోని చెన్నకేశవ, వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ప్రసిద్ధిగాంచిన పాతూరు చెన్నకేశవస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మాస్క్ తప్పనిసరి చేస్తూనే.. ఆలయ ముఖ ద్వారం వద్ద శానిటైజర్ ఏర్పాటు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది.

మడకశిరలో ముక్కోటి ఏకాదశి..

మడకశిర పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిపారు. వేకువజాము నుంచే ఆలయం వద్ద భక్తులు బారులు తీరటంతో.. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. స్వామివారి పల్లకిసేవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు..

ఆర్ఎస్ రోడ్డు వెంకటేశ్వర స్వామి, అశోక్ నగర్ సత్యనారాయణ స్వామి, హౌసింగ్ బోర్డ్ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

నిఘా నేత్రాలతో పటిష్ట బందోబస్తు..

స్వామి విశేష అలంకరణలను చూసేందుకు జిల్లా నుంచే కాకుండా కర్ణాటకలోని బళ్లారి, హోస్పెట్, ఇతర జిల్లాల నుంచి వచ్చే భక్తుల రద్దీను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక టైం స్లాట్, సర్వ దర్శనం భక్తులకు.. విడి విడిగా దర్శనం ఏర్పాటు చేశారు. పోలీసుల సూచనలతో క్యూ లైన్లు, నిఘా నేత్రాలతో ఆలయ కమిటీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు తిరులమ శ్రీవారిని చూసిన అనుభూతి కలుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి...

ఆరేళ్లు కాపాడితే ... ఆకతాయిలు నిప్పు పెట్టారు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.