ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఆమెను వడ్డెర ఉద్యోగ, సంక్షేమ సంఘాలు, కార్పొరేషన్ డైరెక్టర్లు సత్కరించారు. ఛైర్మన్ పదవిని చేపట్టాక తొలిసారి కదిరికి వచ్చారు. దాంతో పుట్టపర్తి నియోజక వర్గాల వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ వడ్డెర్ల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: