తలుపుల మండలం ఓబుల రెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో 2 వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఓ స్థల వివాదంపై నెలకొన్న వివాదం పెరిగి పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో ఆంజనేయులు, అతని సోదరుడి కుటుంబీకులను.. కాలనీలోని మెజారిటీ వర్గానికి చెందినవారు తీవ్రంగా గాయపరిచారు.
గత రెండు రోజులుగా మెజారిటీ వర్గం తమను దూషిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆంజనేయులు కుటుంబ సభ్యులు వాపోయారు. తమ ఇంటిపై దాడి చేసి సామగ్రిని ధ్వంసం చేశారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.
ఇదీ చదవండి: