అనంతపురం జిల్లా తలుపుల మండలం బట్రేపల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 20 మందిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పులివెందుల నుంచి కదిరికి వస్తున్న ఆర్టీసీ బస్సును కదిరి నుంచి తలుపులకు వెళ్తున్న మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. క్షతగాత్రులను ప్రథమ చికిత్స నిమిత్తం పులివెందులలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. తలుపుల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో దారుణం.. యువకుడి గొంతు కోసి హత్య