ETV Bharat / state

మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు - Inspections by SEB officers at Koduru thopu news

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద జాతీయ రహదారిపై ఎస్​ఈబీ అధికారులు తనిఖీలు చేశారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

illegal alcohol packets seized
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం ప్యాకెట్లు
author img

By

Published : Apr 8, 2021, 10:25 AM IST

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టినట్లు ఎస్​ఈబీ అధికారులు తెలిపారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి 2,450 మద్యం ప్యాకెట్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు.

అరెస్టైన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్​ఈబీ అధికారులు తెలిపారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. కర్ణాటక నుంచి మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర సరిహద్దుల్లో బందోబస్తు, తనిఖీ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: 218 సీసాల తెలంగాణ మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.