ETV Bharat / state

two died: శివరాత్రి రోజున సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు మృతి - అనంతపురం లేటెస్ట్​ అప్​డేట్​

శివరాత్రి పర్వదినాన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీటమునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అనంతపురంలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా... నెల్లూరు జిల్లాలో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Two people missing
ఇద్దరు గల్లంతు
author img

By

Published : Mar 1, 2022, 7:53 PM IST

అనంతపురం జిల్లా లేపాక్షి మండలం పూలమతిలో చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు... మృతులు ఒకే కుటుంబానికి చెందిన బాబాయ్​(22), అబ్బాయి(10)గా గుర్తించారు.

నెల్లూరులో మరో ఘటన

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జంగాలపల్లి సమీపంలో ఇద్దరు యువకులు తెలుగుగంగా కాలువలో దిగి గల్లంతయ్యారు. వెంకటగిరి పురపరిధిలోని బంగారుపేటకు చెందిన మాథంగి ప్రతాప్(16), సర్వేపల్లి బాలాజీ(13) అనే ఇద్దరు యువకులు సరదాగా కాలువలోకి దిగారు. అంతలోనే ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఫైర్​ సిబ్బందితో ఘటనాస్థలిలో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: Three missing in Gundlakamma river: శుభకార్యానికి వచ్చి నదిలో గల్లంతై ముగ్గురు మృతి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.