అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో ఇద్దరు బాలురు అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన మంజునాథ్, మణికంఠలు అగ్గిపెట్టెతో ఆడుకుంటూ చెత్తకుప్పకు నిప్పుపెట్టారు. ఆ మంటలు పెద్దవి కావటంతో ఇద్దరు నిప్పంటుకుని గాయాలయ్యాయి. వీరి అరుపులు విన్న గ్రామస్థులు హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరిలో మంజునాథ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్‌పై దాడిని ఖండిస్తూ ఆందోళన