అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం సమీపంలో రెండు కార్లు ఢీ కొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు నుంచి అనంతపురం వైపు వెళుతున్న కార్లు హరిపురం సమీపంలోకి రాగానే ఢీ కొన్నాయి. ప్రమాదంలో ముందర వెళుతున్న కారు... పక్కనే ఉన్న 15 అడుగులు లోతుగల వంతెన కింద వర్షం నీళ్లలోకి పడిపోయింది. ఆ కారులోని ఆగుగురికి ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: