అనంతపురం జిల్లా(anantapur district) కదిరి పాత ఛైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న రెండు భవనాలు(Two buildings collapsed) కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో మరో ముగ్గురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న 9 మందిని సురక్షితంగా బయటకు తీశారు. భవనం కూలే సమయంలోనే గ్యాస్ సిలిండర్ పేలినట్లు బాధితులు పేర్కొన్నారు.
ఓ భవనం కూలి.. పక్కనున్న మరో భవనంపై(three members died due to Buildings collapsed in kadiri) పడింది. దీంతో ఆ భవనం కూడా నేలమట్టమైంది. ఓ ఇంట్లో 8 మంది, మరో ఇంట్లో ఉన్న ఏడుగురు(మొత్తం15 మంది) శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. 9 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీశారు. అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్, ఆర్డీవో వెంకటరెడ్డి.. ఘటనాస్థలిని పరిశీలించారు.
ఇదీ చదవండి