అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. పట్టణ శివార్లలోని 63 నెంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలుకోల్పోయారు. ఇద్దరు ఘటనా స్థలిలోనే చనిపోగా.. మరో యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు గుత్తికి చెందిన ఖాజా మైను, రసూల్, విశ్వనాథ్‌గా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి:
ATTACK: సమయానికి రమ్మన్నారని.. ప్రధానోపాధ్యాయినిపై దాడి
CCTV Footage: అమ్మకు ఆయుష్షు తీరింది.. పాపాయికి కన్నీరే మిగిలింది!