ETV Bharat / state

ఫుడ్ విజిలెన్స్ అధికారుల పేరుతో దందా.. ఇద్దరు అరెస్ట్ - అనంతపురంలో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

ఫుడ్ విజిలెన్స్​ అధికారులమంటూ హోటల్ యాజమానిపై బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అనంతపురం రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ
వివరాలు వెల్లడిస్తున్న సీఐ
author img

By

Published : Nov 28, 2020, 10:44 PM IST

అనంతపురంలో ఇద్దరు నకిలీ విజిలెన్స్ అధికారులను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ జాకీర్ హుస్సేన్ వెల్లడించారు. పాపంపేటకు చెందిన వెంకటేశ్ బాబునాయక్, రాణినగర్ కు చెందిన రామాంజనేయనాయక్.. ఫుడ్ విజిలెన్స్ అధికారులమంటూ నగరంలోని ఓహోటల్ లో యాజమానిని బెదిరించారు. మెుదటి రోజు ఉచితంగా భోజనాలు తీసుకెళ్లారు.

మరుసటి రోజు రామాంజనేయులు డ్రైవర్​నని చెప్పి మరో ఐదు భోజన ప్యాకెట్లు పార్శిల్ ఇవ్వమని అడిగాడు. ఆగ్రహించిన యాజమాని ఇవ్వనని స్పష్టం చేశాడు. ఫుడ్ విజిలెన్స్ అధికారులతోనే పెట్టుకుంటావా నీ అంతు చూస్తానని చెప్పి రామాంజనేయులు వెళ్లిపోయాడు.

హోటల్ యాజమాని 100 కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అధికారులమంటూ మాయ మాటలు చెబితే ప్రజలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.

ఇదీ చదవండి:

'రైతులకు కలిగిన నష్టాన్ని వీడియో తీసి పంపండి.. అసెంబ్లీలో చూపిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.