ETV Bharat / state

తుంగభద్ర ఎగువ కాలవకు సమాంతరంగా మరో కాలవ నిర్మాణం - హెచ్చెల్సీ ఆయకట్టు తాజా వార్తలు

తుంగభద్ర ఎగువ కాలవకు సమాంతరంగా మరో కాలవ నిర్మాణం చేపట్టాలన్న అనంతపురం జిల్లా ప్రజల ఎదురుచూపులు త్వరలోనే సాకారమవనున్నాయి. వరద సమయంలో నదికి వచ్చే నీటిని వినియోగించుకునేందుకు తుంగభద్రకు దిగువన నౌలీ పేరుతో నూతన జలాశయానికి కర్ణాటక ప్రణాళికలు రూపొందిస్తుంది. అయితే సమాంతర కాలవ నిర్మాణానికి అంగీకరిస్తేనే నూతన ప్రాజెక్టుకు అనుమతిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకకు సూచించింది.

తుంగభద్ర ఎగువ కాలవకు సమాంతరంగా మరో కాలవ నిర్మాణం

author img

By

Published : Jun 11, 2020, 4:09 AM IST

అనంతపురం జిల్లాకు తుంగభద్ర జలాశయం నుంచి వచ్చే హెచ్చెల్సీ కాలవ గుండెకాయ లాంటిది. ఏటా వర్షాకాలంలో తుంగభద్ర జలాశయానికి 250 నుంచి 320 టీఎంసీల మేర ఎగువ నుంచి వరద వస్తోంది. తుంగభద్ర డ్యాం నిర్మాణ సామర్థ్యం మేరకు 132 టీఎంసీల నీటిని నిల్వ ఉంచొచ్చు. కొన్నేళ్లుగా ప్రాజక్టు ఎగువన నదిలో రైతులు వ్యవసాయం చేస్తుండటంతో ప్రవాహం వచ్చినపుడు మట్టి కొట్టుకొచ్చి జలాశయంలో పూడిక ఏర్పడింది. 30 టీఎంసీల నిల్వ సామర్థ్యం కోల్పోయింది. వర్షాకాలం ముందు 75 సంవత్సరాల వరద రోజులను లెక్కించి, ఏటా 212 టీఎంసీల నీరు వస్తుందని అంచనా వేశారు. ఈ అంచనా మేరకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి.

కాలవ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల హెచ్చెల్సీ కి 42 టీఎంసీల నీటి కోటా ఉన్నప్పటికీ ఏటా 27 టీఎంసీలు మించి వినియోగించుకోలేక పోతున్నాం. ఈ లోటును భర్తీ చేయటానికి సమాంతర వరద కాలవ నిర్మాణం చేపట్టాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం కర్ణాటక ప్రణాళికలు చేస్తున్న నౌలి జలాశయానికి రాష్ట్రం ఒప్పుకోవడంతో ఈ సమాంతర కాలవ నిర్మాణానికి ఆ రాష్ట్రం అంగీకరించిందని హెచ్చెల్సీ ఎస్‌ఈ తెలిపారు.

హెచ్చెల్సీ కాలవకు సమాంతరంగా కాలవ నిర్మాణం పూర్తి చేయటానికి 1800 కోట్ల రూపాయలు వ్యయంగా ఎస్‌ఈ ప్రాథమిక అంచనా వేశారు. ఆగష్టులో జరగనున్న తుంగభద్ర డ్యాం బోర్డు సమావేశంలో అనుమతి రాగానే నిర్మాణం ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

ఇవీ చదవండి

విశాఖ రైల్వే జోన్​ ఏర్పాటు ఎప్పుడు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.